telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు

Jagapathi-Babu

జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ.. అవును సౌందర్యతో నాకు అఫైర్ ఉండేది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్‌. అందుకే వారి ఇంటికి వెళ్లేవాడిని. సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమె గురించి తప్పుగా అనుకునే వారు కానీ సౌందర్య అలాంటి కాదు. మా బంధాన్ని ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకునే వారు అని జగపతి బాబు అన్నారు. మా బంధం గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటా. ఆ విషయంలో నేను దాయాల్సింది ఏమీ లేదు. అందరి దృష్టిలో అఫైర్‌ అంటే లైంగిక సంబంధం కలిగి ఉండటమని ఆలోచిస్తారు. కానీ నేను, సౌందర్య మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్లం. అదే ఆమెతో నాకున్న అఫైర్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా జగపతి బాబు, సౌందర్య ఇద్దరు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

Related posts