telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘మా’ ఎన్నికలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: పేర్ని నాని

టాలీవుడ్‌లో ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని )పేర్కొన్నారు “మా” ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మద్దతు తమకే ఉందని మంచు విషు ప్యానల్ పరోక్షముగా ప్రకటిస్తూ వస్తోంది.

దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ విషయంపై నాని మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరిగే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,  ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts