telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్ నిజ జీవితానికి హానికరం… రామ్ షాకింగ్ వ్యాఖ్యలు

Ismart-Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రామ్ “పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు “ఇస్మార్ట్ శంకర్‌”లా నిజ జీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్ట్ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అని తెలుసుకుని ఇస్మార్ట్‌గా వ్యవహరించండి” అంటూ ట్వీట్ చేశాడు. రామ్ ఇస్మార్ట్‌గా ట్వీట్ చేసి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో ఇంకెంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related posts