telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విషాదంగా మారిన అప్పగింతలు.. అతిగా ఏడుస్తూ మృతిచెందిన పెళ్లి కూతురు

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట. పెళ్లిళ్లు హిందూ సమాజంలో ఒక విధంగా, ముస్లింలలో ఒక విధంగా, క్రైస్తవుల్లో ఒక విధంగా జరుగుతాయి. కానీ పెళ్లి అంటే ఒకటే అర్థం చెబుతాయి అన్ని మతాలు. హిందు సమాజంలో పెళ్లి అనగానే గుర్తుకు వచ్చేది ఏడడుగులు, తాలిబోట్టు, మండపం, అలాగే మరో ముఖ్యమైన ఘట్టం అప్పగింతలు. పెళ్లి జరిగే వరకు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఈ అప్పగింతల సమయంలో పెళ్లికూతురుతో సహా తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతారు. ఎంతో ప్రేమతో పెంచిన కూతురు అత్తగారింటికి పోతుందని.. ఇక మళ్లీ రాదని తెలిసి ఎంతో బాధపడతారు. ఇక సున్నితమైన మనస్సు ఉన్న వాళ్లు.. ఏడుస్తూ.. కుప్పకూలిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అత్తారింటికి వేళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోనేపూర్‌ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడితో పెళ్లి జరిగింది. మరుసటి రోజున.. అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరపగా.. ఆమె మృతిచెందిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడవడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు వైద్యులు. దీంతో వధువు కుటుంబ సభ్యలు విషాదంలో వెళ్లారు.

Related posts