telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకరోజు ముందుగానే మొదలవ్వనున్న “పుష్ప”

Pushpa

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికం మందన్న కథానాయికగా నటిస్తోంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. లాక్‌డౌన్ సమయంలో విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్‌ లుక్ సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది. అయితే ఈ చిత్రం తాలూకా షూట్ లాక్ డౌన్ మూలాన వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలు కావడానికి అంతా సిద్ధం అయ్యింది. అయితే ఈ సినిమా షూట్ ను నవంబర్ నవంబర్ 6న ప్లాన్ చెయ్యగా ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ రోజు ముందుగా 5వ తేదీనే స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ మొదటి రోజు షూట్ నుంచే బన్నీ కూడా పాల్గొని నిర్విరామంగా నెల రోజుల పాటు సాగించనున్నారు. ఇక ‘పుష్ప’ను పాన్-ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు సుకుమార్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పోలాండ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్ మిరోస్తావ్ క్యూబా బ్రోజెక్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా, ఎర్రచందనం దుంగలను తరలించే లారీ డ్రైవర్‌గా ఆయన కనిపించనున్నారు.

Related posts