దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్-ఎర్నాకులం మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ముఖ్యప్రజాసంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్-ఎర్నాకులం స్పెషల్ (07117) హైదరాబాద్ నుంచి డిసెంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో (బుధవారం) మధ్యాహ్నం 12.50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎర్నాకులం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం-హైదరాబాద్ స్పెషల్ (07118) ఎర్నాకులం నుంచి డిసెంబర్ 5, 12, 19, 26వ తేదీల్లో (గురువారం) రాత్రి 9.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10.55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
హైదరాబాద్-కొచువేలి వీక్లీ స్పెషల్ (07115) : హైదరాబాద్ నుంచి డిసెంబర్ 7, 14, 21, 28వ తేదీల్లో (శనివారం) రాత్రి 9 గంటలకు బయల్దేరి, సోమవారం ఉదయం 3.20 గంటలకు కొచువేలి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొచువేలి-హైదరాబాద్ స్పెషల్ (07116) కొచువేలి నుంచి డిసెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ఉదయం 7.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్-గౌహతి స్పెషల్ (02513) : సికింద్రాబాద్ నుంచి నవంబర్ 7, 14, 21, 28వ తేదీల్లో (గురువారం) ఉదయం 5.40 గంటలకు బయల్దేరి, శనివారం ఉదయం 8.45 గంటలకు గౌహతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి-సికింద్రాబాద్ స్పెషల్ (02514) గౌహతి నుంచి నవంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో (శనివారం) రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మంగళవారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్-విజయవాడ జనసాధారణ్ స్పెషల్ (07192) : సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-హైదరాబాద్ జనసాధారణ్ స్పెషల్ (07193) విజయవాడ నుంచి అక్టోబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ తేదీల్లో రాత్రి 8.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజాము 1.40 గంటలకు సికింద్రాబాద్, 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైళ్ల బోగీలన్నీ జనరల్ సెకండ్ క్లాస్‌తో ఉంటాయి.
లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734) వేగంలో మార్పులు చేశామని, రైలు బయల్దేరే వేళల్లో కూడా మార్పులు చేశామని దక్షిణమధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ మార్పులు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ రైలు అక్టోబర్ 10న లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. బేగంపేట్ (5.50/5.51), సికింద్రాబాద్ (6.15/6.20), బీబీనగర్ (6.49/6.50), రామన్నపేట్ (7.30/7.31), చిట్యాల (7.40/7.41), నల్గొండ (8.00/8.01), మిర్యాలగూడ (8.24/8.25), విష్ణుపురం (8.39/8.40), నడికుడి (8.57/8.58), పిడుగురాళ్ల (9.18/9.19), సత్తెనపల్లి (9.47/9.48), గుంటూరు (11.00/11.10), తెనాలి (11.54/11.55) మీదుగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుతుంది. ప్రస్తుతం తిరుపతికి ఈ రైలు ఉదయం 6.05 గంటలకు చేరుతుండగా, 10వ తేదీ నుంచి ఐదు నిమిషాల ముందుగా తిరుపతి చేరనుంది.
రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం : నమిత హాట్ కామెంట్స్