telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చిన్న పొరపాటు వల్ల ప్రముఖ రెస్టారెంట్ కు రూ.85 కోట్ల నష్టం…!

Burger

న్యూయార్క్‌కు చెందిన క్యారోల్స్ రెస్టారెంట్ గ్రూప్ అమెరికాలోని 1032 బర్గర్ కింగ్ రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఐటమ్‌లపై ఈ ఏడాది కంపెనీ డిస్కౌంట్లను పెట్టింది. రెండు చిన్న వోపర్ల దర నాలుగు డాలర్లు, రెండు వోపర్ల ధర ఐదు డాలర్లు, రెండు డబుల్ వోపర్ల ధర ఆరు డాలర్లగా డిస్కౌంట్‌ను పెట్టారు. అయితే ఎక్కడో చిన్న పొరపాటు జరగడంతో ఈ ఐటమ్‌లతో పాటుగా ఫ్రైస్, డ్రింక్‌లపై కూడా ఆఫర్ ఇస్తూ రావడం జరిగింది. అలా.. ఈ ఏడాది ప్రారంభమైన నాటి నుంచి ఆగస్ట్ వరకు డిస్కౌంట్‌ను వినియోగదారులు ఉపయోగించుకున్నారు. వినియోగదారుడు ఫ్రైస్, డ్రింక్‌పై డిస్కౌంట్‌ను పొందడంతో.. ప్రతి ఐటమ్ ద్వారా కంపెనీకి 1.5 డాలర్ల నష్టం కలిగింది. జరిగిన పొరపాటును యాజమాన్యం ఆగస్ట్‌లో గుర్తించింది. అప్పటికే ఫ్రాంచైజీ నడుపుతున్న వారికి 12.4 మిలియన్ డాలర్ల (రూ. 85 కోట్లు) రివెన్యూ రిడక్షన్ అయింది. పెట్టని డిస్కౌంట్ల కారణంగా తొమ్మిది నెలల కాలంలో 8.2 మిలియన్ డాలర్ల (రూ. 58 కోట్ల 65 లక్షలు) నష్టం వాటిల్లింది. ఈ పొరపాటు వెలుగులోకి వచ్చిన వెంటనే బర్గర్ కింగ్ స్టాక్ కూడా 8 శాతం పడిపోయింది. అయితే పొరపాటును సరిదిద్దిన తరువాత సెప్టెంబరులో కంపెనీ ఆదాయం 7.9 శాతం పెరిగింది.

Related posts