telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వయోలిన్‌ విధ్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ మృతి..

వయోలిన్ విద్వాంసుడు, పద్మ అవార్డుల గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) చెన్నై నగరంలో కన్నుమూశారు. 1926 అక్టబరు 6వతేదీన కేరళలో జన్మించిన కృష్ణన్ తమిళనాడు లోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నై మ్యూజిక్ కళాశాలలో పనిచేసిన కృష్ణన్ చాలామంది విద్యార్థులకు వయోలిన్ నేర్పించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా పనిచేశారు. 1939 లో తిరువనంతపురంలో 11 సంవత్సరాల వయస్సులో సోలో వయోలిన్‌ కచేరిని నిర్వహించారు. అలాగే అలెప్పీ కే పార్థసారధి వద్ద కూడా ఆయన కెరీర్‌ ప్రారంభంలో శిక్షణ ఇచ్చారు. ఆయన 1942లో చైన్నైకి మకాం మార్చారు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ ఆధ్వర్యంలో కెరీర్‌ గ్రాఫ్‌ మరింత పెరిగింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత కళానిదిి వంటి పలు పురస్కారాలన కృష్ణన్ అందుకున్నారు. అయితే..ఆయన మరణ వార్తతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశంలో వేలాది సంగీత కచేరీలు చేసిన కృష్ణన్ మృతి పట్ల సంగీతప్రియులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Related posts