బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివరిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. షారుక్ కొత్త సినిమా పేరు “సంకి” అని, తమిళ దర్శకుడు ఆట్లీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుందనే వార్తలు విన్పించాయి. ఒకప్పుడు ఖాన్ త్రయంలో షారూక్ ఖాన్ లీడింగ్‌లో ఉండేవాడు. వరుసబెట్టి బ్లాక్‌బస్టర్లు దక్కించుకుంటూ తిరుగులేని హీరోగా నిలిచాడు. అయితే ఇటీవలి కాలంలో షారూక్ తన ప్రాభవం కోల్పోయాడు. వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి, ఒకదానిని మించి మరొకటి.. వరుస ఫ్లాప్‌లే షారూక్‌కు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో షారూక్ కాస్త అసహనానికి గురవుతున్నాడు. “ఇలా వరుస ఫ్లాప్‌లు వస్తే.. నాకు ఇక భవిష్యత్తులో సినిమాలు ఉండవేమో” అని కొద్ది నెలల క్రితం మీడియా ఎదురుగా వ్యాఖ్యానించాడు. “మేం ప్రేక్షకులకు నచ్చేలా కథలను చెప్పడంలో విఫలమవుతున్నాం” అని తాజాగా అసహనం వ్యక్తం చేశాడు.
previous post