telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీ ఎలా అయ్యారు..?

minister peddireddy on AP capital

ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. అయితే చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటి ? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో ఎస్‌ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలి అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీ ఎలా అయ్యారు ?  ఏకగ్రీవాలు చట్టవిరుద్ధమని ఏ చట్టంలో ఉంది అని అన్నారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఎలా నిలిపివేస్తారు. టీడీపీని బతికించేందుకే నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన అధికారంలో ఉన్నమంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలి. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాశారు అని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్‌ఈసీ మాటలు విని అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతాం. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదు. చట్టాలకు లోబడి అధికారులు పనిచేయాలి అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చూడాలి మరి దీనికి నిమ్మగడ్డ ఏమని సమాధానం ఇస్తారు అనేది.

Related posts