ఓ భార్య భర్త ఆనందం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. భర్తను, అతడి ప్రియురాలితో వివాహానికి సహకరించింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని ఓ జంటకు మూడేళ్ల కిందట పెళ్లయింది. అయితే గతంలో తన భర్త ఓ యువతని ప్రేమించినట్టు తెలుసుకుంది భార్యామణి.. పెళ్లయినా ఆమెను అతగాడు మర్చిపోలేకపోతున్నాడని గ్రహించింది. దీంతో ఆమెను కూడా పెండ్లి చేసుకుంటానని, ముగ్గురం కలిసి సంతోషంగా ఉండవచ్చని భార్యతో చెప్పాడు. అయితే చట్టరిత్యా అలా కుదరదని భార్య చెప్పింది. మూడేండ్ల వివాహం తర్వాత భర్త సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు ఆమె సిద్ధపడింది. ఉన్నతంగా ఆలోచించిన ఆ భార్య చివరకు భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రేమికురాలితో భర్తకు పెళ్లి చేసింది. ఆ భార్య ఎంతో ఉన్నతంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నదని ఈ విడాకుల కేసును వాదించిన మహిళా న్యాయవాది ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
previous post
శాంతిభద్రతలు దిగజారితే ఏపీకీ చెడ్డపేరు: యనమల