పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువిరుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మతపరమైన హింసను ఎదుర్కొంటున్న వారికి దేశ పౌరసత్వం కల్పించాలన్న సదుద్దేశంతో చట్ట సవరణ చేశామని చెప్పారు. ఏ ఒక్కరి పౌరసత్వాన్ని రద్దు చేయటానికో ఈ చట్టం తీసుకురాలేదని స్పష్టం చేశారు.
విద్యార్థులు సవరించిన పౌరసత్వ చట్టాన్ని ఓసారి చదవాలని సూచించారు. అందులోని అంశాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారాలు చేస్తుంటాయని, వాటి ఉచ్చులో విద్యార్థులు చిక్కుకోరాదని హితవు పలికారు.
కేసీఆర్ ఇలాకలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ: కేటీఆర్