telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సినేషన్ లో ఇండియాదే మొదటి స్థానం…

Indian flag

మన దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం రోజువారి కేసుల్లో ఇతర దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది భారత్.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,26,789 కొవిడ్‌ కేసులు, 685 మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మరోవైపు వ్యాక్సినేషన్‌లో కూడా స్పీడ్ పెంచింది ప్రభుత్వం… స‌గ‌టున ప్ర‌తి రోజూ 34,30,502 క‌రోనా వ్యాక్సిన్ల‌ను ఇవ్వ‌డం ద్వారా ప్ర‌పంచంలోనే భారత్ టాప్‌లో ఉన్న‌ద‌ని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు పేర్కొన్న ఆరోగ్యశాఖ.. ఇందులో 89 ల‌క్ష‌ల మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, 97 ల‌క్ష‌ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు తొలి డోసు తీసుకోగా.. 60 ఏళ్లు దాటిన వాళ్ల‌లో 3.63 కోట్ల మంది, 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య‌లో 2.36 కోట్ల మంది తొలి డోసు ఇచ్చినట్టు వెల్లడించింది.. మరోవైపు.. ప్ర‌పంచవ్యాప్తంగా రోజువారీ వ్యాక్సిన్ల సంఖ్య‌ను పరిశీలిస్తే.. స‌గ‌టున 34.3 ల‌క్ష‌ల వ్యాక్సిన్ల‌తో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. అయితే వ్యాక్సినేషన్ పెరుగుతూనే ఉన్న కేసులు మాత్రం తగ్గకపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది

Related posts