telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ పై గంభీర్ ప్రశంసలు…

ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ ఆదిలోనే రెండు ఇకెట్లు కోల్పోయిన తరత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ రివర్స్‌ స్కూప్ ఆడాడు. అయితే ఈ షాట్ పై భారత మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ స్పందిస్తూ… పంత్ షాట్‌ను ప్రశంసించాడు. ‘అదో అద్భుతమైన షాట్‌. టీమిండియా మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోగా.. పంత్‌ త్వరగా క్రీజులోకి వచ్చాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో కచ్చితమైన లెక్కతో ఆడిన షాట్‌ అది. థర్డ్‌ మ్యాన్‌ లేనప్పుడు డీప్‌స్క్వేర్‌ లెగ్‌, ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్లు ఉండగానే మంచి షాట్‌ ఆడాడు’ అని గంభీర్‌ వివరించాడు. కాగా, పంత్‌ ఇలాంటి స్కూప్ షాట్‌ ఆడడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులోనూ అండర్సన్‌ బౌలింగ్‌లో ఇలాంటి రివర్స్‌ స్కూప్ షాటే ఆడాడు. దానికన్నా ఇప్పుడు ఆడిన షాట్‌ బాగుందని అన్నాడు. అయితే ప్రస్తుతం పంత్ కొట్టిన ఈ షాట్‌‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts