డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో మేనరిజం, డైలాగులు సూటిగా, సుత్తిలేకుండా ఉంటాయి. పూరి.. ఇప్పుడు తన ఆలోచనలు, సూచనలను పోడ్‌కాస్ట్ ద్వారా శ్రోతలతో పంచుకుంటున్నారు. జులై 8న ఈ పోడ్‌కాస్ట్‌ను పూరి మొదలుపెట్టగా వీటిని మంచి ఆదరణ లభిస్తోంది. సినీ ప్రముఖులు సైతం అద్భతం అంటూ కొనియాడుతున్నారు. అయితే, బుధవారం (ఆగస్టు 12న) ఆయన అప్‌లోడ్ చేసిన ఒక పోడ్‌కాస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు విపరీతంగా నచ్చేసింది. గడిచిన 60వేల సంవత్సరాలుగా దేశంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఈ పోడ్‌కాస్ట్ చేశారు. “అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్‌లు.. మగాడి తోడు లేకుండా తమ కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్ వాక్‌లు. స్వతంత్రంగా బతికగలిగే శక్తివంతమైన మహిళను ఈ దేశంలో సత్కరించాలి. వాళ్లే మన మిస్ ఇండియాలు” అని పూరి చాలా గొప్పగా చెప్పారు. ఇదే కాదు.. పూరి పోడ్‌కాస్ట్‌లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ప్రశంసిస్తూ బన్నీ ఒక ట్వీట్ చేశారు. ‘‘పూరి గారు! ఎంత అద్భుతమైన అంశాలండి. మీ పోడ్‌కాస్ట్‌లలో చెబుతోన్న వ్యక్తిగత అభిప్రాయాలు నిజంగా లాగిపెట్టి కొడుతున్నట్టున్నాయి. అద్భుతం. నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్నో మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి పూరి స్పందించారు. ‘‘మీ ట్వీట్‌ను చదువుతూ నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను బన్నీ. మీలాంటి విజయవంతమైన యంగ్‌స్టర్ నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తా. చీర్స్.. లవ్ యు’’ అని పూరి పేర్కొన్నారు. బన్నీ కూడా ‘చీర్స్ సార్.. రెస్పెక్ట్’ అని రిప్లై ఇచ్చారు.
I m gushing with joy and happiness reading your tweet bunny.. it’s a big compliment from a successful youngster like you. One extra peg on you tonight .. cheerssssss🍷
love u 😘 https://t.co/mG2G8lsk1l— PURIJAGAN (@purijagan) August 12, 2020