మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. బిగ్‌బాస్‌లో మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన మెహబూబ్‌కు ఆయన సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రకు మెహబూబ్‌ను తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమా బృందం ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ షూట్‌లో జాయిన్ అయినట్లుగా తెలిపింది. దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో అద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుంది.
previous post