నేటి నుంచి జరిగే మేడారం సమ్మక్క –సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా ఎస్‌ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు.
పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల