telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన…

no flight service on huge rain in delhi

నిన్నటి క్రింద స్థాయి తూర్పు గాలులలో కర్ణాటక తీరం వద్ద తూర్పు-మధ్య అరేబియన్ సముద్రం నుండి దక్షిణ కొంకణి మరియు గోవా మీదుగా దక్షిణ-మధ్య మహారాష్ట్ర వరకు 0.9కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి, ఈరోజు దక్షిణ అరేబియన్ సముద్రం మధ్య ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖ-హిందూ మహాసముద్రం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు-మధ్య అరేబియన్ సముద్రం మరియు కొంకణి-గోవా మీదుగా ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు 0.9కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. నిన్నటి దక్షిణ శ్రీలంక తీరం నుండి ఆంద్రప్రదేశ్ ఉత్తర తీరం వరకు క్రింది స్థాయి తూర్పు గాలులలో 1.5కిమీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు కోమరిన్ ప్రాంతం నుండి మన్నార్ గల్ఫ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు 0.9కిమీ వరకు విస్తరించి ఉన్నది. రాష్ట్రంలో ఈరోజు మరియు రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.

Related posts