ఢిల్లీలోని జేఎన్ యూ క్యాంపస్ లో గత అర్ధరాత్రి విద్యార్థులు, ప్రొఫెసర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులకు హైదరాబాద్, అలీఘడ్, కోల్ కతా, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు ఆందోళనలు చేపడుతూ తమ నిరసన తెలుపుతున్నారు.
బ్రిటన్ లో ఉన్న ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సైతం జేఎన్ యూ ప్రకంపనలు వినిపించడం గమనార్హం. అక్కడి విద్యార్థులు సైతం ప్లకార్డులతో జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్