ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు. వైసీపీకి సభ్యుల బలం ఎక్కువగా ఉండటంతో ఈ మూడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశముంది.
previous post