telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈటల రాజేందర్ నామినేషన్..

హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీతో రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ప్ర‌ధాన‌ పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. నేటితో ఉపఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈనెల 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్నది. దీనికి సంబంధించి అక్టోబర్ 1న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 1 నుంచి 8 వరకు నామినేషన్లను గడువు ఉందని ఈసీ ప్రకటించింది.

దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ రోజు బీజేపీ తరుపున ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరుపున వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు.

Related posts