telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్ ఔట్

యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్‌ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్ హాకీ ప్లేయర్ ఏ విధంగా దోహదకారి అయ్యాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలోని ‘సింగిల్ కింగులం’ సాంగ్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ నుంచి ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. రాహుల్ సింప్లిగంజ్ ఈ సాంగ్ ను ఆలపించగా… సామ్రాట్ లిరిక్స్ అందించాడు. హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించారు.

Related posts