telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాబూల్ : … అధ్యక్ష ఎన్నికలో బిజీగా .. ఆఫ్ఘనిస్థాన్ …

afghanistan president elections

నేడు ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అధ్యక్షుడి ఎన్నిక జరుగుతోంది. దీనికోసం గత రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచార పర్వంలో రక్తపాతం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచార పర్వంలో దాడుల వల్ల 14 మంది ఆఫ్ఘాన్ పౌరులు, ఓ అమెరికన్ సైనికుడు మరణించారు. ప్రస్థుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో పాటు 16 మంది అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. 445 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీరు ఆఫ్ఘాన్లు అయితే బలమైన శాంతియుతంగా నడిపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారిని ఎన్నుకోండి.. అంటూ ఆఫ్ఘనిస్ధాన్ చీఫ్ ఆర్మీ జనరల్ బిస్మిల్లా వాజిరీ కోరారు.

దేశంలో 9.6 మిలియన్ల మంది ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు 1,44,146 మంది జాతీయ, అంతర్జాతీయ పరిశీలకులను నియమించినట్లు ఆఫ్ఘనిస్థాన్ ఎన్నికల సంఘం అధిపతి హబీబ్ ఉర్ రహమాన్ చెప్పారు.

Related posts