telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశ ఆర్థికి వృద్ధిని పెంచడమే ప్యాకేజీ లక్ష్యం: నిర్మలా సీతారామన్‌

Nirmalasitaraman

కరోనా నేపథ్యంలో బలహీన పడిన ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ రోజు ఆమె మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ దేశ ఆర్థికి వృద్ధిని పెంచడమే ఆర్థిక ప్యాకేజీ లక్ష్యమని అన్నారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఐదు మూల సూత్రాల ఆధారంగా ప్రధాని ప్రకటన చేశారన్నారు. దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం ఆధారిత భారత్‌ లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలుగా పేర్కొన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండని చెప్పారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని తెలిపారు.

Related posts