telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇది జీహాదీ పాలిటిక్స్…” అలియాపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు

Rangoli

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చాందేల్ తాజాగా మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రంగోలి ఇప్పుడు నటి అలియా భట్‌పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేయడంతో వార్ కు తెర తీసినట్టు అన్పిస్తోంది. ‘గల్లీ బాయ్‘లో నటించిన అలియాకు ‘ఫిల్మ్ ఫేర్‘లో బెస్ట్ యాక్ట్రస్ అవార్డు దక్కింది. దీనిపై రంగోలి స్పందిస్తూ అలియాపై విమర్శలు గుప్పించారు. ‘గల్లీ బాయ్‘లో అలియా బుర్కా వేసుకునే యువతిగా నటించింది. అమెకు అవార్డు ఇవ్వడానికి ఇది సరిపోయిందని రంగోలి వ్యాఖ్యానించింది. ఇది జీహాదీ పాలిటిక్స్ అని ఆరోపించింది. ఆమెకు తల్లిదండ్రులు నటనను నేర్పించలేదని, అయితే జీహాదీ పాలిటిక్స్‌లో శిక్షణ ఇచ్చారని విమర్శించింది. రంగోలి గతంలోనూ పలువురిపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. మరి రంగోలి వ్యాఖ్యలపై అలియా ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts