telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మున్నీ బద్నామ్ హుయ్” సాంగ్ కు స్టెప్పులేసిన హాట్ భామలు

Malaika

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితం విషయంలోని వివాదాలతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలైకా అరోరా, నోరా ఫతేహి కలిసి ఓ డాన్స్‌ షో వేదికపై సల్మాన్‌ ‘దబాంగ్‌’ సినిమాలోని మలైకా నటించిన ఐటమ్‌ సాంగ్‌ ‘మున్నీ బద్నామ్ హుయ్’ అనే పాటకు ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోను మలైకా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘కేవలం కంటెస్టెంట్స్‌ మాత్రమే ఫన్‌ అందిస్తారా.. కాస్తా ఛేంజ్‌ కోసం ఈ రోజు సోనీ ఛానల్‌లో ప్రసారమయ్యే ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్ ‌షో చూడడం మర్చిపోకండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్ షో న్యాయ నిర్ణేతలలో మలైకా ఒకరు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts