డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియ సినిమాగా కన్నప్పను మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.
మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో ఉంది. శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు, శ్రీ తోటపల్లి సాయి నాథ్ గారు, శ్రీ తోట ప్రసాద్ గారు, శ్రీ నాగేశ్వర రెడ్డి గారు, శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో కన్నప్ప మీద అంచనాలు పెంచబోతున్నారు.