telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్ ను అనుసరించి నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నవంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 3వ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటి ఎస్సీ రిజర్వ్ ఉన్నదని, మిగతా 14 నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అక్టోబర్ 4వ తేదీన ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం మొత్తం 44,42,458 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 22,79,617 ఉండగా మహిళలు 21,62,541, ఇతరులు 300 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 404, ఎన్నారై ఓటర్లు 847, దివ్యాంగులు 24,163, వృద్ధులు 80 సం. పైబడిన ఓటర్లు 83,588 ఉన్నారని తెలిపారు.

ఓటరు జాబితాలో క్లైమ్స్, ఆబ్జెక్షన్ లపై ఎలక్షన్ నామినేషన్ చివరి రోజుకు పది రోజుల ముందు అనగా 31-10-2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

జిహెచ్ఎంసి వ్యాప్తంగా 1,688 లొకేషన్లలో 3,986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,931 ఉండగా సైబరాబాద్ కమిషనరేట్ లో 51, రాచకొండ కమిషనరేట్ లో 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 34,452 పోలింగ్ స్టాఫ్, పోలీస్ పర్సనల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఎన్నికల్లో వినియోగించే ఈ.వి.ఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ పూర్తి చేసి విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్రపరచడం జరిగిందని తెలిపారు. ఇ.వి.ఎం పై అవగాహన కోసం 397 వివిధ బస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని, 16 ప్రదేశాలలో ఈ.వి.ఎం, వి.వి ప్యాట్ ల పై 15,158 మందికి అవగాహన కల్పించడం జరిగింది. 15 మొబైల్ వ్యాన్ ల ద్వారా ఈ.వి.ఎం, వి.వి. ప్యాట్ లపై 15 నియోజకవర్గాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

ఓటర్లకు సందేహాలు నివృత్తి చేయడానికి జిహెచ్ఎంసి లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్, 1800-599-2999 నెంబర్లు 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్ లో ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులను 100 నిమిషాలలోపు క్లీయర్ చేసి యాప్ లో ఉంచుతామని తెలిపారు.

సువిధా సెంటర్ ద్వారా సింగిల్ విండో పర్మిషన్ ద్వారా పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు వినియోగించే నాన్ కమర్షియల్, రిమోటర్, అన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్, హెలీ ప్యాడ్స్ లకు అనుమతి తీసుకోవాలని, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, లౌడ్ స్పీకర్స్ కు అనుమతి తప్పని సరి అని తెలిపారు.

మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్, స్కూృటిని, అడ్వటైజ్మెంట్ సర్టిఫికేషన్ ను సి.పి.ఆర్.ఓ ద్వారా పొందాలని తెలిపారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనుసరించి కంట్రోల్ రూం ను డి.ఇ.ఓ కార్యాలయం, ప్రతి ఆర్.ఓ ఆఫీస్ లలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 6 టీమ్ లతో ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామన్నారు. పొలిటికల్ పార్టీలు చేసే ర్యాలీ లు, మీటింగ్ లను వీడియో గ్రఫీ చేయడానికి 15 నియోజకవర్గాలలో 15 వీడియో సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎం.సి.సి ద్వారా పొలిటికల్ పార్టీలు వాహన వినియోగానికి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ స్థలాల్లో పోస్టర్లు, పెయింటింగ్స్ వేయరాదు. అనధికార అడ్వటైజ్మెంట్ లపై ఎం.సి.సి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పొలిటికల్ సమావేశాలలో మతపరమైన ఉపన్యాసాలు చేయకూడదని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో నియోజకవర్గానికి ఆరు టీమ్ ల చొప్పున 90 టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లను వీడియో తీయడానికి ఒకొక్క నియోజకవర్గానికి ఒకొక్క వీడియో సర్వేలేన్స్ టీం లను ఏర్పాటు చేశామని తెలిపారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై వివిధ రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులకు మార్గదర్శకాలు కమిషనర్ వివరించారు.

జనరల్ కండక్ట్ లో భాగంగా రాజకీయ పార్టీలు భాష, మత, కమ్యునిటీలను దూషించే విధంగా ప్రవర్తించిన వారిపై ఆర్.పి యాక్ట్ 1951 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇతరులను విమర్శించేవిధంగా సంభాషించకూడదని తెలిపారు. మజీద్ లు, చర్చీలు, దేవాలయాల ప్రాంగణంలో ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగకూడదని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేందుకు విలువైన వస్తువులు ఇవ్వడం, ఓటర్లను బెదిరించడం, పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల లోపు ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. పోలింగ్ తేదీ కి 48 గంటల ముందు వరకు ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదని తెలిపారు. ఓటర్లకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించకూడదని అన్నారు. ఎవరి ఇంటి వద్ద కూడా ధర్నాలు, నిరసనలు నిర్వహించకూడదని తెలిపారు. ఏ పార్టీ కానీ బరిలో ఉన్న అభ్యర్థులు కానీ తమ అనుచరులు కానీ ఎవరి ల్యాండ్, బిల్డింగ్, కాంపౌండ్ వాల్ వారి అనుమతి లేకుండా జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వాల్ రైటింగ్ చేయకూడదని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు, అనుచరుల ద్వారా వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న ఇతర పార్టీల సమావేశాలకు ఆటంకం కలిగించకూడదు తెలిపారు. ఒకే ప్రదేశంలో ఇరు పార్టీలు ర్యాలీలు, పబ్లిక్ సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. సమావేశాలు, లౌడ్ స్పీకర్లకులౌడ్ స్పీకర్లు, ర్యాలీలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లోకల్ పోలీస్ అథారిటీ ద్వారా అనుమతి పొందాలని తెలిపారు.

పోలింగ్ రోజు రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ లకు బ్యాడ్జి లు, ఐడి కార్డులు సరఫరా చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఐడెంటి స్లిప్ ను తెల్ల కాగితంలో అందించాలని, దాని పై ఎటువంటి సింబల్స్, అభ్యర్థి పేరు, పార్టీ పేరు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు నుండి మద్యం పంపిణీ చేయకూడదని రాజకీయ పార్టీలకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు క్యాంప్ నిర్వహణ ప్రదేశాలలో ఎక్కువ మంది ఉండకూడదు.

పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు కాకుండా ఇతరులు ఎలక్షన్ కమిషన్ పాస్ లేకుండా ఉండకూడదు. రాజకీయ పార్టీల ప్రతినిదులు, అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికల నిర్వహణ పై ఫిర్యాదులను ఎన్నికల పరిశీలకులకు వివరించవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎన్నికల కమీషన్ సూచించిన నిబంధనలను ఉల్లఘించిన వారి పై ఆర్.పి యాక్ట్ 1951, ఐ.పి.సి సెక్షన్ 171, సెక్షన్ 127 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ 12డి అందించడానికి ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న చో పోలింగ్ సిబ్బంది నేరుగా వారి ఇంటికి వెళ్లి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.

పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ… ఎన్నికల కోసం ఎన్ఫోర్స్మెంట్ పై విస్తృత చర్యలు చేపట్టినట్లు తెలిపారు అందులో బాగంగా. నిన్న పెద్ద మొత్తంలో నగదు ను పట్టుకున్నట్లు తెలిపారు ఎన్నికల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ లు, వి.ఎస్.టి లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం రవాణా, నగదు ప్రవాహం పై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితంగా అందించే వస్తువులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారంట్ టీమ్ లు ఉన్నాయని తెలిపారు. 652 బైండోవర్ లను నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన పై పి.డి యాక్ట్, ఆర్.పి యాక్ట్ 1951 ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 1587 సమస్యత్మాక పోలింగ్ స్టేషన్లు గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా నార్కోటిక్స్ పై మద్యం. గంజాయి నగదు ప్రవాహం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లో జి ఎస్ టి ఐటీ, ఎక్సైజ్ కమిషనర్ టాక్స్ ఆర్టిఏ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కష్టం నార్కోటిక్ ఈడి అధికారులతో 24 గంటల పాటు పని చేసే విధానంగా పని చేస్తున్నాయని జిల్లాలో ,18 ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు సి పి తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా వ్యవహరించడం జరుగుతున్నదన్నారు. ప్రలోబాలకు తావివ్వకుండా పటిష్టమైన నిఘా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ తరుపున పారదర్శకంగా వ్యవరిస్యమన్నారు. ఆర్ ఓ స్థాయిలో కూడా వివిధ అనుమతులకు.సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు తీసుకొనుటకు ఏ యస్ పి స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని సి పి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నిరంజన్ మాట్లాడుతూ… అక్టోబర్ 4వ తేదీన విడుదలైన ఓటరు జాబితాలో ఏ.ఎస్.డి (ఆబ్సేంట్, షిఫ్టిటెడ్, డిలీట్) జాబితాను అందించాలని కోరగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అట్టి సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూడాలని, కొందరి పై మాత్రమే బైండోవర్ లను చేయడం తగదని, పోలీసుల పైన కూడా విజిలెన్స్ ఉండేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కోరగా వాటి పై చర్యలు తీసుకుంటాని పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు.

బి.జె.పి ప్రతినిధి వెంకటరమణ మాట్లాడుతూ… హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు నియోజకవర్గం లో ఎక్కువ శాతం ఓటర్లు పెరుగుతున్నాయని వాటి పెరుగుటకు ఇతర జిల్లాలోని నుండి ఓటరు నమోదు చేస్తున్నరని అన్నారు ప్రతి ఎన్నికకు వేల కొద్దీ ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి పరిశీలన చేయాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్ పుర్ లో ఎక్కువగా ఓట్లు నమోదయ్యాయని తెలుపగా వాటిపై ఎస్.ఎస్.ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్), ఫారం-7, ఫారం-8 ద్వారా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. సి పి యం పార్టీ ప్రతినిధిగా. ఈ పి రేషియో అనగా ఏమిటి అని అడగగా జనాభా . పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగుతుంది ఎన్నికల అధికారి వివరించారు. సెన్సెస్ అధికారులతో పాటు సి ఈ వో కార్యాలయంలో సంప్రదించి సెన్సెస్ అధికారుల పెరిగిన శాతం ప్రకారంగా నిర్ణయించినట్లు తెలిపారు. కూడా పెరిగిందని తెలిపారు. పోలింగ్ స్టేషన్ వారిగా హౌస్ నెంబర్లు కేటాయించాలని కోరగా ఫైనల్ లిస్ట్ లో అదేవిధంగా వస్తుందని ఎన్నికల అధికారి వివరించారు. ఓటరు స్లిప్ లను వేగవంతంగా పంచాలని కోరగా నామినేషన్ చివరి తేదీ నుండి ఎన్నికల కమిషన్ ఆదేశించిన మేరకు ఓటరు స్లిప్ లను పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి వివరించారు. ఓటరు స్లీప్ లనిరాజకీయ పార్టీల ద్వారా పంపిణీ చేయుటకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నిరంజన్ కోరగా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు సూచించిన మేరకు మాత్రమే ఓటరు స్లిప్ లను పంపిణీ చేస్తామన్నారు.
ఓటరు స్లీప్ లను కూడా బి ఎల్ ఏ, తోకలుసి బి ఎల్ ఓ లు పంపిణీ చేస్తారని అదే విధం గా స్లీప్ లి ఆధారంగా కూడా ఏ యస్ డి లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆ లిస్ట్ ప్రకారంగా. ఆర్వోలకు పంపించడం జరుగుతుందని తెలిపారు.

టి.డి.పి ప్రతినిధి రవీంద్ర చారి మాట్లాడుతూ… నియోజకవర్గాల వారిగా ఓటర్ల సంఖ్య పెరిగిందని, డూప్లికేట్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలుపగా వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించామని ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వివరించారు.

బి.ఆర్.ఎస్ పార్టీ ప్రతినిధి కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ… బోరబండలో కొన్ని కాలనీలలో ఏ పిక్ కార్డు తో. పరిశీలించగా అట్టి ఓట్లు ఇతర రాష్ట్రంలో ఉన్నట్లు చూపిస్తున్నట్లు తెలిపగా ఓటరు లిస్ట్ లో అట్టి ఓటరులు ఉన్నారా అని అడిగారు ఓటరు లిస్ట్ లో ఓటర్లు ఉన్నారు కానీ ఓటరు గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తే. ఇతర రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది అని ఆయన వివరించారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకొనవచ్చునమన్నారు. వాటి పై చర్యలు తీసుకుంటామన్నారు

ఎం.ఐ.ఎం పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ. కార్బన్ శాసన సభ్యులు కౌసర్ మోహినుద్దీన్ మాట్లాడుతూ .. కార్వాన్ నియోజకవర్గంలో తుది ఓటరు జాబితా విడుదల సందర్భంగా ఓటరు జాబితాలో పలు పోలింగ్ స్టేషన్ లో ఎక్కువగా మిక్సింగ్ ఓటర్లు సౌ గణనీయంగా పెరిగిందని తెలుపగా బి.ఎల్.ఓ లు హౌస్ టూ హౌస్ సర్వే ద్వారా ఫారం-6, 7, 8 ద్వారా తగిన చర్యలు తీసుకున్నారని ఎన్నికల అధికారి వివరించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్, డిప్యూటీ ఢి.ఇ.ఓ అనుదీప్ దురిశెట్టి, ఈ.వి.డి.ఎం ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts