telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓటరు అవేర్నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వికాస్ రాజ్

సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి సన్మానం చేసిన సిఇఓ.

ఓటర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ సత్ఫలితాలు ఇచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈనెల 4వ తేదీన దుర్గం చెరువు వద్ద ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం పై నిర్వహించిన రాష్ట్రస్థాయి సైకిల్ ర్యాలీ ని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ… యంగ్ ఓటర్స్ కు అవగాహన కల్పించేందుకు పలు కాలేజీలను సందర్శించి ఓటరు నమోదు, ఓటింగ్ పై పూర్తి అవగాహన కల్పించాలని, సుమారు 800 కిలోమీటర్లు తిరిగి పలు కాలేజీల్లో అవేర్నెస్ కార్యక్రమం చేపట్టినట్లు సీఈవో తెలిపారు. హైదరాబాద్ నుండి జనగాం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా కామారెడ్డి జిల్లా హైదరాబాద్ కి వచ్చినట్లు ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీ లో పాల్గొన్న వారిని సన్మానించారు.

ఈ సందర్భంగా వైమానిక రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ మోహన్ మాట్లాడుతూ… సైక్లింగ్ రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన సిఈఓ గారికి అభినందనలు తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ విద్యార్థులు పాల్గొని అనుకున్న లక్ష్యం మేరకు నెరవేరిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన సైకిల్ ర్యాలీ దేశంలో మొట్ట మొదటి సారిగా నిర్వహించడం జరిగిందన్నారు.

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, జాయింట్ సిఈఓ సర్పరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

———————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts