telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా రంజన్ చౌదరి!

Ranajan chowdary

పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి వెళ్తుంది. లోక్‌సభలో 52 మంది సభ్యులతో కాంగ్రెస్ పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న నేపథ్యంలో పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ (పీఏసీ)గా అధీర్ రంజన్ చౌదరి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది.

పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడైన చౌదరి ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు.ఎంపిక చేసిన పార్లమెంటు నేతలతో కూడిన పీఏసీ కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేస్తుంది. పీఏసీతో పాటు ఎస్టిమేట్స్ కమిటీ (ఈసీ), కమిటీ ఆప్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ (సీఓపీయూ)లు పార్లమెంటుకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీలుగా వ్యవహరిస్తుంటాయి.

Related posts