స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవారికి దాదాపు ‘గూగుల్ పే’ యాప్ గురించి తెలిసే ఉంటుంది. డబ్బులు చెల్లింపులు, స్వీకరించడం కోసం ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ధ్రువీకరించలేదంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో గూగుల్ పే అధికారికమేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గూగుల్ పే(జీ-పే) యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో ‘గూగుల్ పే’ పేరు లేదని మిశ్రా తెలిపారు. ఆయన పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్‌బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్ ఇండియాలకు జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఏజే భంభానీలతోకూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు