telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వరల్డ్ కప్ : 5వ వికెట్ కోల్పోయిన కివీస్

World-Cup-2019

మాంచెస్టర్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇవాళ తలపడుతోంది.

ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5వ వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 44.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. రాస్ టేలర్, టామ్ లాథమ్‌లు క్రీజులో ఉన్నారు.

బుమ్రా వేసిన 4వ ఓవర్ 3వ బంతికి మార్టిన్ గప్తిల్ ఔట్ అయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన గప్తిల్ 14 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే తీశాడు. బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా వేసిన 19 ఓవర్ 2వ బంతిని ఆడబోయిన నికోల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో కివీస్ 18.2 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 69 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ తన 3వ వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Related posts