telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆస్పత్రి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్.. మళ్ళీ మాస్క్‌ పక్కన పడేశాడు ..!

trump usa

గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకడంతో ట్రంప్ వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చేరి కరోనా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ చికిత్స క్రమంలో ఏకంగా ఆయన పని అయిపోయిందని అక్కడి మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో మన మీడియా కూడా రచ్చ రచ్చ చేసింది. ఇంకేముందు కాసేపట్లో ట్రంప్ అంటూ రకరకాల కధనాలు వండి వార్చింది.

 

అయితే అనూహ్యంగా కోలుకున్న ట్రంప్ నిన్న మధ్యాహ్నం( అమెరికా కాలమానం ప్రకారం) తాను డిశ్చార్జ్ అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ఎవరూ నమ్మలేదు. కానీ ఆయన మాత్రం కరోనాకు భయపడవద్దు అని చెప్తూ ట్రంప్ మాస్క్ తీసి జేబులో పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వైట్ హౌస్ కి కూడా వెళ్ళిపోయారు. మూడ్రోజుల పాటు చికిత్స కూడా పొందారు. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లో ఉండి, మరో వారంరోజుల పాటు చికిత్స తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా సోకిన రోగులు ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉంటే వెంటనే కోలుకోవచ్చని సూచించారు ట్రంప్.

Related posts