telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్దిని ప్రకటించిన కేసీఆర్

దుబ్బాక అసెంబ్లి నియోజకర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దాని మీద క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్ ఆధినేత, తెలంగాణా సీఎం కేసీఆర్. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్దిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత పేరును కేసీఆర్ నిన్న పొద్దుపోయాక ఖరారు చేశారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమం కోసం,అలానే పార్టీ కోసం రెడ్డి అంకిత భావంతో పని చేశారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని కేసీఆర్ పేర్కొన్నారు.

 

రామలింగారెడ్డి మాత్రమే కాక కుటుంబం యావత్తు కూడా అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందని ఆయన అన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసమని తాను భావిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అలానే ఈ విషయాన్ని జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఇక్కడ బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Related posts