telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఒక్క ఓటు కోసం.. పోలింగ్ కేంద్రం.. 39 కిమీ నడిచే వెళ్ళాలి..

vote counting centers in telangana

దేశంలోని ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించునే అవకాశం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. దీన్ని గుర్తెరిగే ఎన్నిక సంఘం చైనా సరిహద్దులోని ఓ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సిబ్బందిని అక్కడకు తరలిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం అంజా జిల్లా ఉంది. ఈ జిల్లా హయులియాంగ్‌లోని మలోగాం గ్రామంలో సోకెలా తయాంగ్‌ అనే మహిళా ఓటరు ఉన్నారు. ఇదే గ్రామంలో మరికొందరు ఓటర్లు ఉన్నా వారందరి ఓట్లు వేరే కేంద్రంలో ఉన్నాయి. దీనితో సోకెలా కోసమే ప్రత్యేకంగా ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇందు కోసం ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారి, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో కూడిన బృందం 39 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లనున్నారు. కాలినడక ఈ గ్రామానికి చేరుకునేందుకు ఓ రోజు పడుతుంది. 2014లో సోకెలాతో పాటు ఆమె భర్తకు ఇక్కడ ఓటు హక్కు ఉండేది. ప్రస్తుతం ఆమె భర్త ఓటు వేరే కేంద్రానికి మారిందని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి లికెన్‌ కేయూ చెప్పారు.

Related posts