telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాక్ లో విజృంభిస్తున్న కరోనా.. రంగంలోకి దిగిన చైనా

china pakistan corona

కరోన వైరస్ విజృంభించడంతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. పాక్ లో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 1500కు పైగా నమోదయ్యాయి. మృతుల సంఖ్య 20 దాటింది. సమీప భవిష్యత్తులో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకెంతో మిత్రదేశమైన పాకిస్థాన్ సాయమందించేందుకు చైనా రంగంలోకి దిగింది.

తన అనుంగు మిత్ర దేశాన్ని ఆదుకునేందుకు కరోనాకు వైద్య చికిత్స చేయడంలో స్పెషలిస్టులను, అత్యాధునిక పరికరాలను పంపింది. చైనా నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానం పాకిస్థాన్ కు ఈ ఉదయం చేరుకుంది. ఈ విమానంలో వెంటిలేటర్లు, మాస్క్ లు, ఔషధాలు తదితరాలు చేరుకోగా, వీటిని వెంటనే ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు.

Related posts