రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లింది. తాజాగా రాజ్‌భవన్ ఎదుట ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన హడావుడి మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం అశోక్ గెహ్లోత్, గవర్నర్‌ను కలిసేందుకు జైపూర్‌లోని ఆయన నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయన వెనుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం జరుపుతున్న సమయంలో రాజ్‌భవన్ ముందు బైటాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లోత్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.