telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఫేస్‌బుక్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి…

facebook logo

ప్రస్తుతం సోషల్ మీడియా రంగంలో ముందు వరుసలో ఉంది ఫేస్‌బుక్. ‌అయితే ఇప్పుడు ఆ ఫేస్‌బుక్ కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి… తాజాగా యూజర్లకు మరో షాకింగ్‌ న్యూస్‌.. 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఇది 2019 లో ఫేస్‌బుక్‌లో లీక్‌ అయిన ఒక పాచ్ ద్వారా  విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు  ఉత్పన్నమవుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం, 533 మిలియన్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు బహిర్గతం కాగా.. అందులో సుమారు 6 లక్షల మంది భారతీయ యూజర్ల మొబైల్ నంబర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. యూజర్‌కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్‌ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయింది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్‌ నెంబర్ల విక్రయిస్తున‍్నట్టు మదర్‌బోర్డు తన నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది. కాగా, ఇప్పటికే వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. ఫేస్‌బుక్‌ నుంచి మరో షాకింగ్‌ న్యూస్‌ వినాల్సి వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts