telugu navyamedia
క్రీడలు వార్తలు

జట్టులో మార్పు పై స్పందించిన అయ్యర్…

ఇంగ్లం‌డ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి పై శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ… తమ బ్యాటింగ్‌ పద్ధతిలో ఎలాంటి మార్పులు చేసుకోమని టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ స్పష్టం చేశాడు. అయితే ఫస్ట్ టీ20లో టాపార్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన అయ్యర్.. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. పాండ్యాతో కలిసి శ్రేయస్‌ అయ్యర్ దాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 124/7 స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. అయ్యర్ హాఫ్ సెంచరీ లేకుంటే భారత్ ఆ మాత్రం పరుగులు చేసేది కాదు. అయితే ‘టీమిండియాలో ఆడేటప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. నా బ్యాటింగ్‌ శైలిలోనూ ఏ మార్పులు చేసుకోలేదు. ఏ స్థానంలో ఆడుతున్నామనే విషయం కేవలం ఆలోచనా విధానం మాత్రమే. జట్టుకు ఏది అవసరమో అదే చేయాలని ఆలోచించాలి. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక మా బ్యాటింగ్‌ తీరులో ఎలాంటి మార్పులూ చేసుకోము. ఎందుకంటే మాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. పవర్‌ హిట్టర్లు తగినంత మంది ఉన్నారు’ అని శ్రేయస్‌ తెలిపాడు.

Related posts