telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

“జగనన్న చేతోడు” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌…

cm jagan

జగన్‌ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి “జగనన్న తోడు” స్కీముని ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జగనన్న తోడు స్కీములో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల రుణం ఇప్పించనుంది ప్రభుత్వం. పది లక్షల మంది లబ్దిదారులకు జగనన్న తోడు స్కీమ్ కింద రుణం ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను గుర్తించిన ప్రభుత్వం…. సుమారు 3.60 లక్షల దరఖాస్తుల్ని వివిధ బ్యాంకులకు పంపారు అధికారులు. గుర్తించిన చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వనుంది జగన్ సర్కార్. ఇక బ్యాంకు అకౌంట్లు లేనివారికి అకౌంట్లు కల్పించబోతున్నారు.  ఐదడుగుల, అంతకంటే తక్కువ స్థలంలో ఉన్న షాపులకు, ఫుట్ పాత్ లపైన, తోపుడు బండ్లపైన, గంపల్లో వివిధ వస్తువులను పెట్టుకొని ఊరూరా తిరిగి అమ్ముకునే వ్యాపారాలు ఈ తోడు స్కీమ్ కి అర్హులని సీఎం జగన్ తెలిపారు.  గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం ఉన్నవారు ఈ తోడు స్కీమ్ కి అర్హులని సీఎం తెలిపారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సీఎం పేర్కొన్నారు.  

Related posts