telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కర్ణాటకీయం : .. మాకు ముప్పు అంటున్న ఎమ్మెల్యేలు.. డీకే కు కూడా అనుమతి నిరాకరణ..

DK Sivakumar assets of 500 crores to IT

కర్ణాటక రాజకీయం ఇప్పుడప్పుడే తేలేట్టు కనిపించడం లేదు. మొత్తానికి మధ్యలో ఎమ్మెల్యేలు మాత్రం దొరికిన చోట దొరికినంత అన్నట్టు .. పోగుచేసుకుంటున్నారు. అయితే వీరందరికి ప్రాణహాని ఉందని, అదికూడా తమ పార్టీ నుండే అంటూ పిర్యాదు ఇవ్వడంతో, ముంబైలోని ఓ హోటల్‌లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబై వెళ్లిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్‌కు ముంబై పోలీసులు షాకిచ్చారు. హోటల్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. దీంతో వారితో చర్చలు జరిపి సంక్షోభానికి ముగింపు పలకాలన్న ఆయన అశలు అడియాసలైనట్టే కనిపిస్తున్నాయి.

తమకు ముఖ్యమంత్రి కుమారస్వామిని కానీ, డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు మరింత భద్రత కల్పించాలని కోరారు. దీంతో తమకు అదనపు సెక్యూరిటీ కావాలంటూ ముంబై పోలీస్ కమిషనర్‌కు హోటల్ యాజమాన్యం లేఖ రాసింది. తాము పదిమందీ హోటల్‌ రెనైసెన్స్ పొవాయ్ హోటల్‌లో ఉన్నామని, సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్‌లు హోటల్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారి నుంచి తమకు ముప్పు ఉందని, వారిని హోటల్ ఆవరణలోకి అనుమతించవద్దని ఆ లేఖలో కోరుతూ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. స్పందించిన డీసీపీ మహారాష్ట్ర రిజర్వు పోలీస్ ఫోర్స్‌తోపాటు అల్లర్ల నియంత్రణ పోలీసులను హోటల్ వద్ద మొహరించారు. అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ సహా ఎవరు వచ్చినా అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Related posts