అనుష్కశర్మ దంపతులు బిజీ షెడ్యూల్‌లో ఏ కొంచెం విరామం దొరికినా ఇరువురు తమ సమయాన్ని ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ దుస్తులను దొంగిలించి వేసుకుంటానని చెప్పుకొచ్చింది. విరాట్ వార్డ్ రోబ్‌లో బోలెడన్ని దుస్తులు ఉంటాయి. వాటిలో నాకు నచ్చినవి తీసేసుకుంటా. ఎక్కువగా విరాట్ టీ-షర్టులను వాడేస్తా. కొన్నిసార్లు జాకెట్స్ కూడా వేసుకుంటాం. ఎందుకంటే అలా మావారి దుస్తులు నేను ధరించినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇక తన పెళ్లి సందర్భంగా ధరించిన గులాబీ రంగు దుస్తులను కావాలని ఎంపిక చేసినవి కాదని తెలిపింది. ట్రెండ్‌ను తాను ఫాలో అవనని చెప్పింది. రెండేళ్ల కిందట విరాట్‌తో తన పెళ్లి సందర్భంగా అనుష్క ధరించిన లెహంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరుష్క జోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. విరాట్ నవంబరు 5న తన పుట్టినరోజు వేడుకలను అనుష్కతో కలిసి జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా దిగిన వారు ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
విష్ణు ప్యానల్ వాళ్లకు నేనంటే భయం…