telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు!

corona stamps ms

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల చేతులపై స్టాంపులు వేయాలని నిర్ణయించింది. కరోనా అనుమానితులు ఎప్పటివరకు వరకు క్వారంటైన్‌లో ఉండాలి అనే సమాచారం కూడా అందులో ఉండనుంది.ఇలా చేస్తే కరోనా అనుమానితులను గుర్తించటం సులువతుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే అభిప్రాయపడ్డారు.

అలాగే, వారు సాధారణ ప్రజలతో కలవకుండా నిరోధించవచ్చని చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఏడుగురు కరోనా అనుమానితులు చికిత్సా కేంద్రాల నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి ఉద్ధవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా అనుమానితులకు ఎడమ అరచేతి వెనుక భాగంలో ఈ స్టాంపులు వేయాలని భావిస్తున్నారు.

Related posts