telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నవరత్నాలు కావు..నకిలీ రత్నాలు : జగన్ సర్కార్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu tdp

ఇవాళ్టి కి వైసీపీ ప్రభుత్వానికి రెండు ఏండ్లు. అయితే సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని చురకలు అంటించారు. సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతారు.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో మొదలు పెడుతుందన్నారు. నవరత్నాలు కావు ఇవి… నకిలీ రత్నాలు అని మండిపడ్డారు. జేసీబీ-ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం ప్రారంభించారని.. ఏసీబీ-జగన్ పరిపాలన కోసం ఎవరైనా ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు చేయిస్తారని ఫైర్ అయ్యారు. పీసీబీ-ఏసీబీల ద్వారా కుదరక పోతే పొల్యూషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దించుతారని.. సిఐడి-అంటే జగన్ మోహన్ రెడ్డి సంస్థ అని మండిపడ్డారు. సీఎం జగన్ ఏది చెప్తే అది.. CID చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అధికార పార్టీలో ప్రతీ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని..జగన్ పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల చావులకు కారణం సీఎం జగనే అని..మద్య పానాన్ని నిషేదిస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కావాలంటే ప్రత్యేక హోదా కావాలన్నారు. వైసీపీ భూ దాహానికి విశాఖ ఉక్కు బలి అయ్యిపోతుందని మండిపడ్డారు.

Related posts