telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటి తండ్రిపై రేప్ కేసు… 20 ఏళ్ళ యువతిని గన్ తో బెదిరించి…!

shehanaz

బాలీవుడ్ నటి తండ్రి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బిగ్ బాస్ 13 సీజన్‌లో షెహనాజ్ గిల్ పాల్గొంది. తన దైన శైలీలో షోలో కనిపిస్తూ అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది. షెహనాజ్ పంజాబి సినిమాల్లో కూడా నటించింది. ఆమె సింగర్ కూడా. షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ ఓ యువతిని రేప్ చేసారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు 20 ఏళ్ల అమ్మాయి స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడిని కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటలకు వారు బియాస్ కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ యువతిని బెదిరించాడు. అమ్మాయిపై తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 14న ఈ దారుణం జరిగినప్పటికీ… ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది. ఓ వ్యక్తి చొరవతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇవన్నీ అవాస్తవ ఆరోపణలు అని కొట్టి పారేస్తున్నాడు షెహనాజ్ గిల్ బ్రదర్ షెహబాజ్.

Related posts