telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ అవుతుందా ?

Ram gopal Varma Fire Censor board
“లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ ఎప్పుడవుతుందో తెలియ వర్మ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏ సినిమాకు కస్టాలు ఇంకా తొలిగిపోలేదు . ఈ సినిమా చూస్తామని సెన్సార్ అధికారి రాజశేఖర్ వర్మకు మాట ఇచ్చాడు. దీంతో వర్మ సెన్సార్ మీద కోర్టు వెళ్లే ఆలోచన విరమించుకున్నాడు. 
తన సినిమా సెన్సార్ అధికారి చూస్తామని చెప్పడంతో ఈ నెల 22 అనుకున్న విడుదలను 29 కి వాయిదా వేసినట్టు ప్రకటించాడు. ఈరోజు 21వ తేదీ. సెన్సార్ అధికారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూసేది ఇంకా చెప్పడం లేదు. సెన్సార్ అధికారి రాజశేఖర్ మాటలు నమ్మి వర్మ సినిమా విడుదల తేదీ ప్రకటించాడు. ఈ విషయంలో వర్మ టెన్షన్ పడుతున్నాడు. బుధవారం నాడు వర్మ సెన్సార్ కార్యాలయానికి వెళ్లి ఆఫీసర్ రాజశేఖరం ను కలిచినట్టు తెలిసింది.
 
 “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని ఎప్పుడు చూస్తున్నారని వర్మ అడిగాడని, అందుకు అధికారి ఆ సినిమా విషయంలో కొన్ని ఇబ్బందులు వున్నాయి కాబట్టి కొంచము  సంయమ కావాలి అన్నట్టు తెలిసింది. అయితే ఆ ఇబ్బందులు ఏమిటనేది రాజశేఖరం చెప్పలేదు. అయితే సినిమా  విడుదల తేదీ ప్రకటించామని వర్మ ఆఫీసర్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. సినిమా ను చూస్తాను అని ఆయన బదులిచ్చినట్టు  తెలిసింది. అంతే తప్ప ఎప్పుడు అనేది వర్మకు చెప్పలేదు. ఈ సినిమా ను రాజశేఖరం శుక్రవారం చూస్తారా ? లేదా సోమవారమా  ?  అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు రామగోపాల్ వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తెలియక టెన్షన్ గా ఉన్నట్టు తెలిసింది. ఈ సినిమా ను సెన్సార్ అధికారి వెంటనే చూస్తాడా ? కావాలనే వాయిదా వేస్తున్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. 
-భగీరథ 

Related posts