telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” టీజర్

dear camrades movie first look

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రష్మిక, విజయ్‌ను హత్తుకున్నట్లుగా కన్పించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఈ టీజర్లో విజయ్, రష్మిక మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ హైలెట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే ఎప్పటిలాగే విజయ్ సినిమాలో రొమాన్స్ కు కొదవ లేదన్పిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది.

ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక, విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ జంటగా “గీత గోవిందం” చిత్రంలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts