telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

యాషెస్‌ టెస్టు : .. బ్యాటు జులిపిస్తున్న .. స్మిత్ .. మూడో శతకం..

ashes test series smith century

నాలుగు టెస్టులలో మూడు సంతకాలు సాధించి ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ సూపర్ ఫామ్ లో ఉన్నానని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్‌లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్‌ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్‌ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి కాసేటి తర్వాత మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత రోజు నుంచి కాంకషన్‌తో బాధపడటంతో సబ్‌స్టిట్యూట్‌గా మరో క్రికెటర్‌ వచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌ ఆడలేదు. మూడో టెస్టుకు స్మిత్‌ను ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్‌లోనే బెన్‌స్టోక్స్‌ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో వికెట్‌ తేడాతో ఇంగ్లాండ్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 60తో ఆట కొనసాగించిన స్మిత్‌కు 65 పరుగుల వద్ద మరో లైఫ్ లభించింది. ఆర్చర్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌ అవకాశం చేజార్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్మిత్‌ కెరీర్‌లో 26వ శతకం బాదేశాడు. 160 బంతుల్లో 11 బౌండరీలతో లాంఛనం పూర్తిచేశాడు. అంతకు ముందు అతడికి యాషెస్‌లో వరుసగా 8 అర్ధశతకాలు చేసిన రికార్డు ఉంది. తొలి టెస్టులో స్మిత్‌ 144, 142 చేశాడు. రెండో టెస్టులో 92 పరుగులు సాధించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక రేటింగ్‌ పాయింట్‌ తేడాతో కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న స్మిత్‌ ఈ శతకంతో నంబర్‌ వన్‌ ర్యాంకును పటిష్ఠం చేసుకుంటాడు.

Related posts