telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అదుపు తప్పిన విమానం… విమానం కింద మనిషి

PLane

కువైట్‌లోని ఓ విమానాశ్రయంలో టెక్నికల్ స్టాఫ్‌గా పనిచేస్తున్న కేరళ వాసి విమానం కింద పడ్డాడు. అక్కడ ఉన్న ఓ ఖాళీ బోయింగ్ విమానాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమాన తరలింపును ఆనంద్ రామచంద్రన్ అనే 36 ఏళ్ల ప్రవాసీ పర్యవేక్షిస్తున్నాడు. ఆ సమయంలోనే అదుపుతప్పిన విమానం.. అతని మీదకు ఎక్కేసింది. ఈ ప్రమాదంలో ఆనంద్ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. అతని మ‌ృతదేహాన్ని బుధవారానికల్లా భారత్‌లోని వారి కుటుంబానికి చేరవేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై అవసరమైన దర్యాప్తు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

Related posts