telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఉప్పల్ పిఎస్ పరిధిలో కార్పొరేటర్ దౌర్జన్యం

crime

ఉప్పల్ పీఎస్ పరిధిలో కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగాడు. 7వ డివిజన్ చిలకనగర్ లో నూతనంగా ఎన్నికైన టిఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్ దౌర్జన్యం దిగాడు. తన అనుచరులతో వెళ్లి రౌడీలా వీరంగం సృష్టించాడు ప్రవీణ్. చిలకనగర్ లోని శ్రీనివాస హైట్స్ నివాసితుల నివాసాలకు గుండాలతో వెళ్లి దాడి చేశాడు. కార్పొరేటర్ వీరంగంతో భయపడ్డ శ్రీనివాస హైట్స్ నివాసితులు.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు పిర్యాదు చేశారు. ఎందుకు దాడి చేశారో తెలియకుండా కొట్టారంటున్నారు బాధితులు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts